40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోలీసు వ్యవస్థకు సేవలందించిన హోంగార్డు ఎండి యావర్ అలీ పదవి విరమణ పొందారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పదవి విరమణ పొందుతున్న హోంగార్డును జిల్లా పోలీసుల సమక్షంలో ఎస్పీ గౌస్ ఆలం పూలమాల శాలువాతో సన్మానించి బహుమతి ప్రధానం చేసి సత్కరించారు. హోంగార్డు ఎండి యావర్ అలీ 1984 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా హోంగార్డుగా పోలీసు వ్యవస్థలోకి అడుగుపెట్టి సుదీర్ఘకాలంగా వివిధ అధికారుల వద్ద కుక్ గా విధుల నిర్వర్తించి అధికారుల ప్రశంసలను అందుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సర్వీస్ నందు ఎలాంటి రిమార్కులు లేకుండా విధులను నిర్వర్తించి సక్రమంగా పదవి విరమణ పొందడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రశేఖర్, సిబ్బంది రమేష్, అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.