ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో దేవనగర్ గ్రామంలో పిచ్చి మొక్కల తోలగింపు
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఒక అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో దేవనగర్ గ్రామస్తులు కదిలారు.గ్రామంలో చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా శనివారం అందరు కలసి గ్రామంలోని పిచ్చి మొక్కలను స్వచ్ఛందంగా తొలగించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. డిచ్ పల్లి మండలంలోని దేవనగర్ గ్రామంలో సర్పంచ్ మొహమ్మద్ యూసుఫ్ పిలుపు మేరకు స్వచ్చందంగా ఒక అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి, గ్రామపంచాయతీ పరిసరాలను శుభ్ర పరచడం లో పాల్గొన్నారు. సందర్భంగా సర్పంచ్ మొహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో గ్రామంలోని పలుచోట్ల పిచ్చి మొక్కలు పోదలు కాకుండా చోట్ల అపరి శుబ్రంగా ఉండడంతో నడుము బిగించి నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకుంటే దోమలు తాకిడి తగ్గుతుందని ఇదే కాకుండా ఇతర వ్యాధుల కూడా రాకుండా ఉంటాయన్నారు. గ్రామ ప్రజల ఆర్యోగల దృశ్య ఇలాంటి విరుద్ధ కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా ఉంచడానికి అందరు కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ మొహమ్మద్ యూసుఫ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పందిరి శ్రీనివాస్, వార్డు సభ్యురాలు జైన బీ, మాజీ ఉపసర్పంచ్ బుచ్చమ్మ, గ్రామస్తులు ,యువకులు, మహిళా లు పాల్గొన్నారు.
కదిలిన గ్రామం.. ఎందరికో స్పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



