నీరుగారుతున్న ఆత్మ పథకం..

– రెండేళ్లుగా నిధుల్లేవ్.. రైతులకు అవగాన కరువు
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు ఆధునిక పద్దతుల్లో సాగు  చేయడంపై అవగాన వ్యవసాయ సాంకేతిక సంస్థ {ఆత్మ పథకానికి) రెండేళ్లుగా నిదులు మంజూరు కావడం లేదు.దీంతో క్షేత్రస్థాయి పర్యటనలు,విజ్ఞాన్ కిసాన్ మేళాల నిర్వాహణ నిలిసిపోయింది.ఆత్మ కార్యక్రమాల నిర్వహణకు 2023లో మండల వ్య వసాయాధికారులు ప్రతిపాదనలు పంపిన నిదులు మంజూరు కాలేదు. 2023-24,  2024-25 ప్రతిపాదనలు పంపాలని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు.ఆత్మ పథకం కొనసాగుతుందా.లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అవగాహన సదస్సులు కరువు..
ఆత్మలో భాగంగా వ్యవసాయ,ఉద్యాన,పట్టు పరిశ్రమల, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో రైతుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడతారు.వానాకాలం సీజన్ ప్రారంభమైన వెంటనే నూతన సాగు పద్దతులలో అవగాహన కార్యక్రమాలతోపాటు శిక్షణ ఇస్తారు.వ్యవసాయ క్షేత్రాలకు రైతులను తీసుకెళ్లి వారిలో సాంకేతికతను పెంపొందిస్తారు.ప్రధానంగా విజ్ఞాన యాత్రలు, పద్దతులపై సిడిల ద్వారా అవగాహన కల్పిస్తారు.మార్కెట్ లో వచ్చే నూతన వంగడాల గురించి వివరిస్తారు.మండల స్థాయిలో విత్తనోత్పత్తి, చీడ,పీడ పురుగుల నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తారు.మొత్తం మీద 24 రకాల కార్యక్రమాలు నిర్వహించేవారు.ప్రస్తుతం నిదులు లేక రైతులకు సలహాలు,సూచనలు ఇవ్వడానికి సమావేశాలు నిర్వహించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అవగాహన కల్పిస్తే మేలు..
మండలంలో ఎక్కువగా వ్యవసాయంపై, ఆధారిత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా వరి, పత్తి,మిర్చి,మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నారు.కొద్దీ మొత్తంలో కూరగాయలు సాగు చేస్తున్నారు.మామిడి,సొరకాయ,పుచ్చకాయ తదితర తోటలున్నాయి.ప్రతి ఏటా 15 వేల ఎకరాలకు పైగా సాగు చేస్తారు.మత్స్యకారులు చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపడుతున్నారు.రైతులకు ఆధునిక విధానంపై అవగాహన లేదు.పాత పద్దతుల్లో అవలంబిస్తూ అధికంగా నష్టపోతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మ పథకం ద్వారా అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుంది.ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మ సంస్థకు నిదులు కేటాయించాలని మండల రైతులు కోరుతున్నారు.
నిధులు కేటాయించాలి: అక్కల బాపు..రైతు సంఘం నాయకుడు
ఆత్మ పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి.రెండేళ్లుగా నిదులు కేటాయించకపోవడంతో పథకం నిరుగారిపోతుంది.రైతులను చైతన్య పరచకపోవడంతో పాత పంటలను సాగు చేస్తున్నారు.రైతులకు అవగాన కల్పిస్తూ ఆధునిక పంటల సాగు వైపు మరలించాల్సిన అవసరం ఉంది.
Spread the love