ఉపాధి పనులకు దివ్యాoగులు అనాసక్తి

– సగంమంది కూడా పనులకు వేళ్ళని వైనం
– కఠిన నిబంధనలే కారణమా.?
– ప్రత్యేక భత్యం రద్దు
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాదిహామీ పథకం పనులపై దివ్యాoగులు అంతగా ఆసక్తి చూపడం లేదు.ఇందుకు గతేడాది మండలంలో నమోదైన గుణనంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దివ్యాంగులకిచ్చే ప్రత్యేక భత్యాన్ని రద్దు చేయడం, ఉపాధిహామీ పనుల నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు వారికి చూపించే పనులు కూడా మార్చడంతో వచ్చేందుకు వారు వెనుకడుగు వేస్తున్నారు.దీంతో దివ్యాంగులకు వంద రోజుల ఉపాది కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నిరుగారుతోంది.
నిబంధనలు కఠినతరం..
ఉపాధిహామీ పథకంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం పనుల కల్పన,వేతనాల చెల్లింపునకు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రానికి పరిమితం చేసింది ఇందుకోసం గతేడాది పలు సంస్కరణలు చేపట్టింది. పనుల కల్పనకు సంబంధించిన వెబ్సైట్ మారడంతో దివ్యాoగులకు కల్పించే పనుల నిబంధనలను కఠినతరం చేసింది.గతంలో దివ్యాoగులు 70శాతం పని చేస్తే వారికి వందశాతం కూలి చెల్లించేవారు. సకలాంగులకు ఏడాదిలో వంద రోజుల పని కల్పిస్తే ,దివ్యాoగులకు 150 రోజులు పని కల్పించేవారు. పైగా వారికి 5 కిలో మీటర్ల లోపు మాత్రమే పనులను చూపేవారు.ఒకవేళ అంతకంటే ఎక్కువ దూరం పనికి వెళ్లాల్సి వస్తే 20 శాతం  అలవెన్స్ లను అదనంగా చెల్లించేవారు. పైగా వారికి నర్సరీలో మొక్కల పెంపకానికి సంబంధించిన బ్యాగులను నింపడం, ముళ్ల చెట్లను తొలగించడం, చెళ్ళలోని రాళ్లను తీసివేయడం వంటి సులభతరమైన పనులను చేయించేవారు. దివ్యాంగులకు సంబంధించి పనుల ప్రగతిపై ప్రత్యేక  నివేదికలను కోరేవారు.కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.
సగంమంది మాత్రమే హాజరు..
మండలంలో మొత్తం 15 గ్రామపంచాయితీలు ఉన్నాయి.ఇందులో మొత్తం  దివ్యాoగులు 256 ఉన్నారు.ఇందులో జాబ్ కార్డులు కలిగి ఉన్నవారు 132 మంది ఉన్నారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో 132 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన సగంమంది కూడా పనులకు హాజరు కాలేదు. పనులకు వచ్చినవారు గతేడాది మొత్తం 771 పని దినాలు పూర్తి చేశారు.అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఉన్న వెబ్సైట్ ను కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడంతో దివ్యాంగులకు ఉన్నటువంటి ప్రయోజనాలన్ని రద్దుయ్యాయి. విరుకుడా సకలాంగులతో సమానంగానే ఉపాధిహామీ పిల్డ్ అసిస్టెంట్లు చూపించే పనులను కొలతల ప్రకారంగానే చేయాల్సి వస్తోంది. పనులు కఠినతరంగా ఉండడంతో వారికి కల్పించిన రాయితీలు లేకపోవడంతో దివ్యాంగులు పనులకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వారికి పని కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నిరుగారుతోంది.
Spread the love