Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంఆందోళనల సెగ

ఆందోళనల సెగ

- Advertisement -

ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమైన ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె
విదేశాల్లో ఉన్నత విద్యపై 
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ

న్యూఢిల్లీ : నీట్ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు, విద్యార్థుల దేశవ్యాప్త నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ల మధ్య ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోటీ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు, నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఆమె సోషల్ మీడియా ఖాతాపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈ పరిణామం చోటుచేసుకోడం చర్చనీయాంశంగా మారింది.సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు నైమిషా ప్రధాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తించి, ఆమె విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడాన్ని ప్రశ్నిస్తూ పెద్ద సంఖ్యలో కామెంట్లు చేశారు. అనంతరం ఆ ఖాతా అందుబాటులో లేదు. దీంతో ఆమె దానిని డీయాక్టివేట్ చేసినట్టు మీడియా కథనాలు తెలిపాయి. ప్రaస్తుతం ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనిపించడం లేదు.

విదేశీ విద్యపై విమర్శలు
నైమిషా ప్రధాన్ 2023లో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మెడ్‌ఫోర్డ్‌లో ఉన్న టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన ఫ్లెచర్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌ఎం) పట్టా పొందారు. అనంతరం యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్)లో సీనియర్ అసోసియేట్‌గా చేరినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. “దేశ విద్యా వ్యవస్థకు బాధ్యత వహిస్తున్న మంత్రి కుమార్తె విదేశాల్లో చదవడం భారత ఉన్నత విద్యపై నమ్మకం లేకపోవడానికే నిదర్శనం కాదా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -