రాజస్తాన్‌లోని బవారాలో భారీ ర్యాలీ ప్రదర్శనకారుల పై జులుం
జైపూర్ : పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా రాజస్తాన్‌లోని బన్స్‌వారా జిల్లాలో గురువారం నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై భారీ నిరసన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిని చెదరగొట్టడానికి పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యయి. “ప్రదర్శనకారులను శాంతియుతంగా నిరసన చేపట్టడగా..పోలీసు వారితో ఘర్షణకు దిగారు. నిరసనకారులు ముందుకు రాకుండా నిరోధించడానికి పోలీసులు బలప్రయోగం చేశారు. లాఠీచార్జీ చేసి వారిని ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని సహచర నిరసనకారులు ఆస్పత్రులకు తరలించారు.
నిరసనలపై విరిగిన లాఠీ
- Advertisement -
- Advertisement -



