మానసిక ఆరోగ్యాన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో విటమిన్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా విటమిన్ డి అనగానే మనం ఎముకల ఆరోగ్యం గురించే ఆలోచిస్తాం. సరిపడ విటమిన్ డీ లభించకపోతే. ఎముకలు గుల్లబారకుండా ఉంటాయని, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసిందే. అయితే విటమిన్ డీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినే కాకుండా.. విటమిన్ డీ కుంగుబాటును కూడా నివారిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో డోపమైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే డోపమైన్ ఉత్పత్తయ్యే సబ్స్టాన్షియా నైగ్రాతో పాటు మెదడులోని కీలక భాగాల్లోనూ విట మిన్ డీ గ్రాహకాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. మానసిక సమస్యలను దూరం చేయడంలో విటమిన్ డీకి ప్రత్యక్ష సంబంధం ఉంటుం దని అనడానికి ఇదే నిదర్శనమని నిపుణులు చెబుతు న్నారు. సాధారణంగా చర్మానికి ఎండ తగిలిన సమ యంలో 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ పుట్టుకొచ్చి, విట మిన్ డి3గా మారుతుంది. ఇది కాలేయం నుంచి కిడ్నీలకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 1.25 డైహైడ్రాక్సీ విటమిన్ డిగా రూపాంతరం చెందు తుంది. మన శరీరం వాడుకునే విటమిన్ డీ ఇదే. అందుకే కచ్చితంగా ఉదయం కాసేపు ఎండలో ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఎండలో ఉంటే మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరటోనిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కుంగుబాటు వంటి లక్షణాలు దూరమవుతాయి.