అక్రమ సంబంధంతో భర్తను చంపిన భార్య

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణం వెంకటరమణ కాలనీలో నివాసము ఉంటు కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు.ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి చంపి వేసిందని మంగళవారం చౌటుప్పల్ డివిజన్ ఏసిపి వై.మొగిలయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ విలేకరులకు తెలిపారు. రమావత్ లాలు నాయక్ s/o దివంగత మాన్సింగ్ నాయక్, వయస్సు:59 సంవత్సరాలు,కులం: లంబాడ,కారు డ్రైవర్ r/o సలీం నగర్,బంజార కాలనీ,హయత్ నగర్. సొంత గ్రామం కొక్కిరాలతండ h/o నసర్లపల్లి,చింతపల్లి మండలం,నల్గొండ జిల్లా.ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పట్టణ పోలీసులు గాలించగా నిందితులు A1 మాతంగి మహేష్ తండ్రి లక్ష్మయ్య వయసు:24,లింగారెడ్డిగూడెం చౌటుప్పల్ లో ఉంటున్నాడు.A2 రమావత్ సరోజ(శ్రీను భార్య) తో అక్రమ సంబంధం పెట్టుకుంది.రమావత్ వెంకటేశ్వర్లు@శ్రీను s/o లాలునాయక్,వయస్సు:38 సంవత్సరాలు,కులం:లంబాడ, చౌటుప్పల్ పట్టణం లోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నాడు .నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి H/o కొక్కిరాలతండ,నసర్లపల్లి సొంత గ్రామం.తేది: 03.12.2023 ఆదివారం అర్ధరాత్రి ఫోన్ చాటింగ్ ద్వారా A2 రమావత్ సరోజ కోరికపై A1 మాతంగి మహేష్ తాడుతో A2 వద్దకు వెళ్లాడు తరువాత A1 మరియు A2 ఇద్దరు రమావత్ వెంకటేశ్వర్లు అలియాస్ శ్రీనును మెడలో తాడుతో బిగించి హత్య చేశారు.మృతునికి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు.నందగిరి పరమేష్‌కు చెందిన ఇంట్లో రమావత్ శ్రీను అలియాస్ వెంకటేశ్వర్లు అద్దెకు ఉంటున్నాడు.మృతుని అద్దె ఇల్లు ఎదురుగా ఉన్న గర్దాసు బాలయ్య ఇంటి మెట్లపై మృతుని మృతదేహాన్ని ఉంచారు.తేది 5.12.2022 సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.00 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలోని  అద్దె గదిలో A1 మాతంగి మహేష్ మరియు A2 రమావత్ సరోజ ఉండగా చౌటుప్పల్ పోలీసులు వారిని పట్టుకు న్నారు.వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చౌటుప్పల్  ఏసిపి వై.మొగిలయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ తెలిపారు
Spread the love