నవతెలంగాణ – హాజీపూర్
మండలంలోని పెద్దాంపేట్ గ్రామానికి చెందిన బెడద కార్తీక్(28) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..కార్తీక్ ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయి అప్పుల పాలయాడు. అప్పులు తీర్చ లేక ఈ నెల 14న పొలం వద్ద గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య స్రవంతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.