నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఇంఛార్జి చైర్మన్ గా భూరోల్ల అశోక్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. మాజీ ఛైర్పర్సన్ గోపులక్ష్మి అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 28, 2023న రాజీనామా చేయడంతో సోమవారం స్థానిక సొసైటీ డైరెక్టర్లు తీర్మానం చేయడంతో ఇంఛార్జి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సొసైటీ కార్యదర్శి సంతోష్, హెడ్ క్లార్కు విజయ్ కుమార్, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.