Friday, May 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్లూ ఆరిజిన్ టెస్టింగ్‌లో ప్రమాదం

బ్లూ ఆరిజిన్ టెస్టింగ్‌లో ప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బ్లూ ఆరిజిన్‌ ‘న్యూ గ్లెన్‌’ రాకెట్ టెస్టింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్ ఇంజన్లను మండించి చూసే ఈ పరీక్ష సమయంలో ఒక్కసారిగా లాంచ్ ప్యాడ్‌పైనే భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడు ధాటికి రాకెట్ ప్రయోగ వేదిక (Launch Pad) తో పాటు రాకెట్ పరికరాలు భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఈ పరీక్షను రిమోట్ కంట్రోల్ ద్వారా సురక్షిత ప్రాంతం నుండి పర్యవేక్షించడం వల్ల, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తృటిలో తప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై బ్లూ ఆరిజిన్ మరియు నాసా (NASA) బృందాలు విచారణ జరుపుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -