పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్లు జైలు

విజయనగరం : పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం గరికివలసకు చెందిన గుమ్మిడి ఆదినారాయణ ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో దిశ మహిళా పోలీసు స్టేషనులో 2023 ఫిబ్రవరిలో పోక్సో చట్టం ప్రకారం దిశ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి కేసు నమోదు చేశారు. డిఎస్‌పి ఎం.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు చెప్పారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్‌ అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించారు.

Spread the love