మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ-బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ మండల కేంద్రంలో బినామీ ఫార్మసీ పత్రాలతో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం బాన్సువాడ డివిజన్ ఇన్ ఛార్జ్ మేకల సాయిలు బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ తెలంగాణ, డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్కు ఆయన ఫిర్యాదు చేశారు.
Spread the love