విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవు: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే ఎటువంటి అధికారి, ఉద్యోగి అయిన చర్యలు తప్పవని  కలెక్టర్ ఎస్ వెంకట్రావు హెచ్చరించారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంకతో కలిసి  అధికారులతో వెబేక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వ శాఖకు చెందినవారైనా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని, ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని ఔట్సోర్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ పని చేయాలన్నారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. సక్రమంగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు చేపడతామన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక ఔట్సోర్సు ఉద్యోగి విధులకు హాజరు కావడంలేదని జాయింట్ కలెక్టర్ పరిశీలనలో వెల్లడి కాగా ఆ శాఖకు చెందిన జిల్లా అధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఏ అధికారిని ఉపేక్షించేది లేదని, ఇకనుండి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అన్ని శాఖల సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు పనితీరు మార్చుకొని విధుల పట్ల బాధ్యతయుతంగా పనిచేయాలన్నారు.
Spread the love