ఆవిర్భావ ఏర్పాట్లును పరిశీలించిన అదనపు కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు ఎన్నికల నిబంధనలకు లోబడి చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ సి హెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో చేపట్టే ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసి అందించాలని స్టేజి, శమియనాలు, గ్యాలరీలు ముఖ్యంగా నిరంతర విద్యుత్ పాటు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామ, మండల అలాగే జిల్లా స్థాయిలో ఆవిర్భావ వేడుకలు ఎన్నికల సంఘం లోబడి చేపట్టాలని సూచించారు. అదేవిదంగా ఐడిఓసి లో గల కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బంది ఉదయం 8.30 వరకు చేరుకోవాలని సూచించారు.
Spread the love