ఆదివాసి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ ఎన్నిక

నవతెలంగాణ –  కామారెడ్డి
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో ఈ నెల 11వ తేదీ నుండి 15 తేదీ వరకు నిర్వహించే ఆదివాసి కాంగ్రెస్ లీడర్షిప్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరానికి  కామారెడ్డి జిల్లా నుండి రాణా ప్రతాప్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ రాథోడ్  గిరిజన యువ నాయకులు ఎంపికయ్యారు. ఈ ఆదివాసి శిక్షణ శిబిరానికి  తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురిని ఎంపిక చేయడం జరిగిందనీ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ తెలిపారు. ఎంపికైన వారిలో భూక్య కోటియా నాయక్ ( కోదాడ), రాణా ప్రతాప్ రాథోడ్ (కామారెడ్డి), శ్రీనివాస్ రాథోడ్ ( రంగారెడ్డి), నరేష్ రాథోడ్ ( కామారెడ్డి)లు ఉన్నారు.  ఈ శిక్షణ శిబిరానికి కార్యనిర్వహణ వ్యవహారాల కోసం జిల్లా నుండి మమ్మల్ని ఇద్దరిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ద్వారా ఉత్తర్వులు జరిచేశారు. ఈనెల 11 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ఆదివాసి గిరిజన కాంగ్రెస్ శిక్షణ శిబిరానికి తమ వంతు సహకారం పూర్తి కృషి ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Spread the love