29న ఛలో కలెక్టరేట్ వాయిదా 

నవతెలంగాణ –  కంటేశ్వర్
మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి, పెండింగ్ లో ఉన్న డైట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ కమిటీ ఇచ్చిన పిలుపు నిజామాబాద్ జిల్లా కమిటీ గా నిర్వహించే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడా అనిల్ మాట్లాడుతూ..భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్  జిల్లా కమిటీ సోమవారం జనవరి 29న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనీ, మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలనీ , పెండింగ్లో ఉన్న డైట్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కార్యాలయాల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది కానీ నిజామాబాద్ జిల్లాలో ప్రజాసంఘాలుగా లెనిన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సభ ఉండడంతో సోమవారం నిర్వహించే జిల్లా కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు త్వరలో ఒక తేదీ ప్రకటిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో చదివి విద్యార్థులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదలకై నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి ఎస్ఎఫ్ఐ ప్రాథమిక కమిటీ నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని విధంగా నాయకులు కార్యకర్తలు చూడాలని అన్నారు. దీనికి విద్యావేత్తలు ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో నగర అధ్యక్షులు వాగ్మారే విశాల్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డి దీపిక నగర ఉపాధ్యక్షులు సందీప్ గర్ల్స్  కన్వీనింగ్ కమిటీ సభ్యులు మేఘన సుమిత్ర వీణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love