సర్దుబాటు.. భంగపాటు

– నాలుగు నెలలుగా వీఆర్‌ఏలకు అందని వేతనాలు
– ఆగస్టులో సర్దుబాటు చేసిన బీఆర్‌ఎస్‌ సర్కారు
– రంగారెడ్డి జిల్లాలో 610 మంది వీఆర్‌ఏలు
– ఇతర జిల్లాల్లోనూ విధులు నిర్వహిస్తున్న వైనం
– అర్థాకలితో అలమటిస్తున్న ఉద్యోగులు
– రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
ప్రభుత్వ ఉద్యోగం సాధించినా.. పర్మినెంట్‌ కోసం ఉద్యమించారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని నినదించారు. 80 రోజుల సమ్మె చేశారు. ప్రభుత్వం దిగివచ్చింది. ఉన్న ఉద్యోగం తీసేసి.. కొత్త ఉద్యోగం వచ్చింది. జిల్లా సరిహద్దులు దాటారు. తమకు కేటాయించిన శాఖల్లో చేరారు. ఉద్యోగులుగా గుర్తించినా.. ఐడీ కార్డులు ఇవ్వడం లేదు. జీతాలురాక గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) ఆవేదన చెందుతున్నారు. వీరిని గత ప్రభుత్వం సర్కార్‌ ఉద్యోగులుగా క్రమ బద్ధీకరించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేసింది. కానీ అర్థాకలి జీవితాలు గడుపుతున్నారు. వేతనాలు లేక అప్పులపాలవుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మోసపోయారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. వేతనాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

జిల్లాలో 640 మంది
వీఆర్‌ఏల సర్దుబాటు..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ ను ప్రక్షాళన చేయడంతో వీఆర్‌ఏలు చెల్లా చెదుర య్యారు. జిల్లాలో మొత్తం 640 మంది వీఆర్‌ఏలు ఉండేవారు. మున్సిపల్‌ శాఖలో వార్డు అధికారులు గా 85 మంది, రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసి స్టెంట్లుగా 41మంది, రికార్డు అసిస్టెంట్లుగా 97 మంది, ఆఫీస్‌ సబార్డినేటర్లుగా 43మంది, చైన్‌ మెన్లుగా 29, వాచ్‌మెన్లుగా నలుగురు, ఇరిగేషన్‌ లాస్కర్లుగా 52, మిషన్‌ భగీరథ హెల్పర్లుగా 171 మంది, ఇతరశాఖల్లో 118 మందిని సర్దుబాటులో చేశారు. కాగా తమకు ఎంప్లారు ఐడీకార్డు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొందరు ఇతర జిల్లాల్లోకి..
జిల్లాలోని 29 మండలాల పరిధిలో 558 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తం 640 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లాలో కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వగా, మహబూ బ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కొందరిని సర్దుబాటు చేశా రు. గత ప్రభుత్వం వారి వేతనాలను రూ.10,500 లకు పెంచింది. దాంతో పాటు వారికి పదోన్నతి కల్పిస్తామని, వారి వారసులకు ఉద్యోగాలు ఇసా ్తమని 2016లో, 2020లో అప్పటి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెవెన్యూ భూప్రక్షాళన పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చింది. దీంతో కేసీఆర్‌ హామీ అమలుకాకపోవడం తో సుమారు 80రోజుల పాటు వీఆర్‌ఏలు సమ్మె నిర్వహించారు. తత్ఫలితంగా వీఆర్‌ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులతో నాటి ఐటీ మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ధరణితో వీఆర్‌ఏల వ్యవస్థ రద్దు..
గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టిన తరువాత వీఆర్‌ఏల వ్యవస్థను రద్దు చేసింది. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూశాఖలో పని చేస్తున్న వీరం దరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమే కాకుం డా ఆగస్టు 10వ తేదీన ఆయా శాఖలకు బదిలీ చే స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌ఏల విద్యార్హత ప్రకారం జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిసెం ట్లు, సబార్డినేట్లుగా, అటెండర్లుగా, చైన్‌మెన్‌లుగా, లష్కర్లుగా వివిధ హౌదాల్లో ఆరోగ్య, విద్యా, పశువైద్య, కలెక్టరేట్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపాలిటీ, మిషన్‌ భగీరథ తదితర శాఖల్లో సర్దుబాటు చేసింది.
పెండింగ్‌లో వారసత్వ ఉద్యోగాలు..
జిల్లాలోని 640మంది వీఆర్‌ఏలున్నారు. ఇంకా అనేక మంది వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు సుమారు వంద మంది వరకు ఉండడంతో పెండింగ్‌లో పెట్టారు. వారికి ఉద్యోగాలు లేకపోయినా తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులుగా పని చేయిస్తున్నారు.
ఉద్యోగ ఐడీ కోసం ఎదురు చూపులు..
వీఆర్‌ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం వారికి ఉద్యోగ ఐడీ కార్డులను జారీ చేయలేదు. ఈ తరుణంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియను ప్రభుత్వం మరిచింది. బదిలీలతో ఊరు కాని ఊరుకు వెళ్లి అప్పులు చేసి మరీ జీవనం సాగి స్తున్నామని వీఆర్‌ఏలు వాపోతున్నారు. వీఆర్‌ఏ లను సర్దుబాటు చేయకముందు రెండు నెలల క్రిత మే నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ఆ సమయం లోనూ వేతనాలు రాలేదు. మొత్తం ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా ఉద్యోగ ఐడీలతో పాటు వేతనాలను అందించేలా చర్యలు తీసుకోవా లని వారు కోరుతున్నారు.

Spread the love