పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్యాసింజర్‌ ఆటోను ఢీకొట్టిన కారు
– ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
– క్షతగ్రాతులను హైదరాబాద్ కు తరలింపు
నవతెలంగాణ-పరిగి
వికార బాద్‌ జిల్లా పరిగి మున్సిపల్‌ పరిధిలో శ్రీ వేంకటేశ్వర బాయిలర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మ తిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిగి ఎస్‌ఐ విట్టల్‌ రెడ్డి తెలిపిన వివరల ప్రకారం గండీడ్‌ మండలం వెన్నచేడ్ కు  చెందిన ప్యాసింజర్‌ ఆటో వివిధ గ్రామాల నుండ ప్యాసింజర్లను ఎక్కించుకొని పరిగికి వస్తోంది. ఈ ఆటోలో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నరులు, ఐదు మంది పురుషులు ఉన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో శ్రీ వెంకటేశ్వర బాయిలర్‌ మిషన్‌ వద్ద హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై పరిగి నుంచి కొడంగల్‌ వెళ్తున్న కారు అజాగ్రత్తగా, రష్‌ డ్రైవింగ్‌తో ప్యాసింజర్‌ ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న 15 మందికి గాను తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి. తొమ్మిది మంది పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించరు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించరు. హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యమంలో దోమ మండలం పీర్లగుట్ట తాండాకు చెందిన హెమ్లీ బారు (55), గుండాలకు చెందిన శశికళ (35), కొత్తపల్లికి చెందిన అంజిలమ్మ (65) మృతి చెందారు. క్షతగ్రాతులను హైదరాబాద్‌లో పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్‌కు స్వల్న గాయాలు కాగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్టు ఎస్‌.ఐ తెలిపారు.

Spread the love