తనాకుర్ధి గ్రామంలో మొదలైన వ్యవసాయ పనులు

నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలంలోని తనాకుర్ధి గ్రామం తోపాటు వివిధ గ్రామాలలో గత రెండు మూడు రోజుల నుండి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. కాకపోతే వర్షపాతం అనుకూలత లేకపోవడం వల్ల బోరు బావుల దగ్గరనే నాట్లు జోరందుకుంటున్నాయి. చాలామంది రైతులు రోజు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. కూచన్పల్లి సాయి రెడ్డి అనే రైతు తమ పొలాలలో ఉండే బోరు బావి నీటితో పొలం నాటిన వెంటనే గడ్డి మందు చల్లుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు భూమి కన్నతల్లి లాంటిదని భూమికి బోరు బావి నీటి కంటే వర్షాపాతం నీటితో నాటిన మొక్కకి ఎదుగుదల ఉంటుందని దిగుబడి బాగా వస్తుందని తెలుపుతూ వర్షపాతం అనుకూలిస్తే నాతోపాటు మిగతా రైతులు కూడా పొలాల్లో నాట్లేసి చాలా సంతోషంగా గడిపి ఉండేవారని ఆయన అన్నారు మోపాల్ మండల గడిచిన రోజులు నుండి వర్షపాతం చాలా తక్కువ మోతాదులో నమోదు అయింది. ఈ మండలంలోని ప్రజలందరూ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారు. ఒక రైతుకు నాట్లు వేసిన వెంటనే ఎంతో పని భారం తగ్గుతుందని చాలా సంతోషంతో ఉంటారు.

Spread the love