జియో బాటలోనే ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్

నవతెలంగాణ – హైదరాబాద్: మొబైల్ ఫోన్ యూజర్లకు ఎయిర్‌టెల్ కంపెనీ నుంచి బ్యాడ్ న్యూస్. రీఛార్జ్ ప్లాన్స్ ధరలు 11 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో కంపెనీ కూడా మొబైల్ టారిఫ్ ను పెంచుతున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.. రిలయన్స్ జియో 12 నుంచి 27శాతం రేట్లు పెంచింది. ఎయిల్ టెల్ పెంచుతున్న టారీఫ్ ఛార్జీలు జూలై 3 నుంచి అమలులోకి రానున్నాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటా 28రోజుల ప్లాన్‌ రూ.179 నుండి రూ.199 లకు పెరగనుంది. పెంచిన ధరల ప్రకారం జూలై 3 తర్వాత ఎయిర్ టెల్ ఇయర్(365రోజుల) ప్లాన్ మీద రూ.200, 84 రోజుల ప్యాక్ మీద రూ.54 లు పెరగనున్నాయి. రెండున్నర ఏండ్ల తర్వాత ఎయిర్ టెల్ కంపెనీ రీఛార్జ్ ప్లాన్లపై ఛార్జస్ పెంచింది. డైలీ డేటా ప్లాన్స్, యాడ్ ఆన్ ప్లాన్స్ పై కూడా రేట్లు పెరగనున్నాయి.

 

Spread the love