విద్యార్థులకు ఏకే పౌండేషన్ మరో గొప్ప అవకాశం

– ఐఐటి, జేఈఈ, నీట్ లో ఉచిత శిక్షణ
– కేవీఆర్ అకాడమీ హైదరాబాద్ ప్యాకల్టీ చే శిక్షణ
– అతి త్వరలో హాలియా పట్టణం లో ప్రవేశ పరీక్ష
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏకే పౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు. కట్టేబోయిన అనిల్ కుమార్ యాదవ్, విద్యార్థులకు చదువులకు తోడ్పాటు అందించేందుకు మరో కొత్తకార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. పొండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడకు చెందిన కేవీఆర్ అకాడమీ ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కట్టేబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అతిత్వరలో 6వ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థుల కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు అకాడమీ హైదరాబాద్ ప్యాకల్టీ చే హలియా పట్టణం లో సమ్మర్ క్యాంప్ ఉచిత కోచింగ్ ఇవ్వబడును. ప్రతి విద్యర్డి ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏకే పౌండేషన్ ఛైర్మెన్ కట్టే బోయిన అనిల్ కుమార్ ఆదివారం తెలిపారు.

Spread the love