Sunday, July 12, 2026
E-PAPER
Homeసినిమాఅఖిల్ హిట్టు కొట్టాడు

అఖిల్ హిట్టు కొట్టాడు

- Advertisement -

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
నాగార్జున మాట్లాడుతూ,’ ‘‘అన్నమయ్య’ చేశాక నేను దేవుడ్ని ఏదీ అడిగింది లేదు. కానీ తిరుపతిలో ఈవెంట్ అయ్యాక.. స్వామిని దర్శించుకున్నప్పుడు మాత్రం మా వాడికి ఓ హిట్టు ఇవ్వండని అడిగాను. ఆయన ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం ‘తండేల్’ సక్సెస్ మీట్‌కి వచ్చాం. ఇప్పుడు ఇలా ‘లెనిన్’ సక్సెస్‌కి వచ్చాను. నాగవంశీ ఈ సినిమాకి పిల్లర్’ అని అన్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, ‘‘లెనిన్’ ఓ డిఫరెంట్ మూవీ అని మాకు తెలుసు. కమర్షియల్‌గా ఎలాంటి నంబర్స్ వస్తాయో అని అనుకున్నాను. కానీ మా చిత్రానికి ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు. నా వల్ల ఏమైనా సినిమా తేడా కొడుతుందా? అని భయపడ్డాను. నా గత చిత్రాల్ని, నా గతాన్ని వదిలేసి ‘లెనిన్’ చిత్రాన్ని సపోర్ట్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ‘ఊహించిన దానికంటే సినిమాకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఈ సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి అంతకంటే ఏం చూపించగలం. సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ మనోడు హిట్టు కొట్టాడు.. అఖిల్ హిట్టు కొట్టాడు అని అంటుంటే ఆనందంగా ఉంది’ అని అన్నారు.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ, ‘ఈ సక్సెస్‌ని కూడా ప్రశాంతంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాను. పదహారేళ్ల తరువాత నా సొంత ఊరికి గర్వంగా వెళ్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -