Sunday, July 12, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్

అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్

- Advertisement -

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో మాట్లాడుతూ,’
‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎమోషన్, కామెడీ, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ‘షాక్ కొట్టడం’ అనే కాన్సెప్ట్ చుట్టూ వచ్చే వినోదం, భావోద్వేగాలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.
కథకు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ అయితే బాగా సరిపోతారని అనిపించింది. ప్రేక్షకులు టికెట్‌కు పెట్టిన ప్రతి రూపాయికి పూర్తి స్థాయి వినోదం పొందుతారు. ఇది ప్రతి కుటుంబం కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కీరవాణి అసోసియేట్ భరత్ మంచి సంగీతం అందించారు. తిరువీర్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే సత్యదేవ్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ వుంటుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -