నేడు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్
ప్రజలు ఆందోళనపడొద్దు : ఎన్‌డీఎమ్‌ఏ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్‌ను చేపడుతున్నది. శనివారం దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను ఒకేసారి కవర్ చేస్తారు. సరిహద్దు ప్రాంతాలు మరియు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మినహాయింపు ఇచ్చినట్టు తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీ ధనుంజయరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష సమయంలో పౌరులు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు. ఈ అలర్ట్ గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్‌తో వస్తుంది. ఆ సమయంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదని ప్రజలు గ్రహించాలి. ఈ అలర్ట్ అందుకున్నప్పుడు ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమైన సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడానికి కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రజలు ఈ టెస్ట్ అలర్ట్ అందుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. భయపడకూడదు. గందరగోళానికి గురికాకుండా ఈ పరీక్ష గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు తెలియజేయాలని కోరారు.
అలర్ట్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



