వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ గా అంతటి రజిత.?

నవతెలంగాణ – అచ్చంపేట 
నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత ఫ్రోటోకాల్ కలిగిన పదవి వ్యవసాయ మార్కెట్ చైర్మన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రావడం, అచ్చంపేటలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపొందడం తో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల చైర్మన్ పదవులను ప్రభుత్వం రద్దు చేసింది. నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వుడు కేటాయించారు.  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వలపట్ల కాలానికి చెందిన అంతటి మల్లేష్ భార్యా అంతటి రజిత వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పదవి బాధ్యతలు అప్పగించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. దీంతో త్వరలోనే మార్కెట్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. అంతటి మల్లేష్  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలో వంశీకృష్ణ గెలుపు కోసం అలుపెరుగని కృషి చేశారు. వాస్తవానికి ఓసి జర్నల్ రిజర్వు కేటాయించడం జరుగుతుందని ప్రచారం జరిగింది. చాలామంది పదవిని ఆశించి పోటీపడ్డారు. ఎస్సీ మహిళకు కేటాయించడంతో బీసీ, ఓసి వర్గాలను అసంతృప్తి ఏర్పడింది.
Spread the love