గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలలో అన్ని వస్తువులు కల్పించాలి..

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : వచ్చే జూన్ 9 న గ్రూప్-1 పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే అధికారులను ఆదేశించారు.  శనివారం నాడు ఆయన గ్రూప్ -1 పరీక్షకు కావలసిన ఏర్పాట్లపై డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్రతో కలిసి సంబంధిత శాఖల సమన్వయ సమావేశంలో సమీక్షిస్తూ  భువనగిరి పట్టణంలోని 9 పరీక్షా కేంద్రాలలో మదర్ థెరిసా హైస్కూల్, మాంటెస్సోరీ హైస్కూల్, దివ్యబాల విద్యాలయం హైస్కూలు, వెన్నెల ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, భువనగిరి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పెంటగీ నగర్ లోని ఎస్ ఎల్ ఎన్ ఎస్  కాలేజీ, పహడీ నగర్ లోని శ్రీ నవభారత్ డిగ్రీ, పిజి కాలేజీ, జాగృతి డిగ్రీ, పిజి కాలేజీ కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, మొత్తం 3349 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలియచేస్తూ, పరీక్షా కేంద్రాలను పరిశీలించి అవసరమైన అన్ని వసతులను కల్పించాలని, గ్రూప్-1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు రూట్ల ఏర్పాటుతో ఒక రూటులో 5 సెంటర్లు, ఇంకొక రూట్ లో 4 సెంటర్లు ఉంటాయని, పది మంది అబ్జర్వర్లను, 9 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను, 39 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, వీరందరికి రీజనల్ కోఆర్డినేటరు, జిల్లా నోడల్ అధికారి, పోలీసు నోడల్ అధికార్ల సమన్వయంతో ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్ అంతర్గత వైరింగ్ పరీశిలించాలని, సబ్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రానికి వచ్చే లైన్ చెక్చేసుకోవాలని, పరీక్ష సందర్భంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమీషనర్ పరీక్షా కేంద్రాలలో ఏమైనా పనులుంటే ఈనెల 31 లోగా పూర్తి చేసుకోవాలని, బందోబస్తు దృష్ట్యా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించాలని, పరీక్షా కేంద్రాల వద్ద పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రం వద్ద పార్కింగ్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్, అధికారులు సులభంగా పరీక్షా కేంద్రాలకు వచ్చి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద బయట వ్యక్తులు లేకుండా చూడాలని, మహిళా పోలీసు ఏర్పాటుతో మహిళా అభ్యర్ధులను తనిఖీ చేయాలని, ఏర్పాటు చేసిన 2 రూట్లలో ఎస్కార్ట్ పఠిష్టంగా ఉండాలని, పరిక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పరీక్ష రోజు మొత్తం జీరాక్సు సెంటర్లు మూసివేయాలని తెలిపారు. పరీక్ష మెటీరియల్ స్ట్రాంగ్ రూము నుండి పరీక్షా కేంద్రాలకు, తిరిగి పరీక్ష అనంతరం స్ట్రాంగ్ రూముకు మంచి సామర్థ్యం ఉన్న వాహనాలలో తరలించాలని, అలాగే చట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే అభ్యర్ధులకు అదనంగా, ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని, మొత్తం పరీక్షా కేంద్రాలలో శానిటైజర్స్, మెడికల్ సదుపాయాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాలు పరిసరాలలో రెండు రోజుల ముందే పారిశుద్య చర్యలు చేపట్టాలని త్రాగునీరు సౌకర్యం కల్పించాలని, దివ్యాంగ అభ్యర్ధుల కోసం స్క్రైబ్స్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి నియమించిన ఛీఫ్ సూపరింటెండెంట్ ఎలక్ట్రిసిటీ, కుర్చీలు, బెంచీలు, ర్యాంపు తదితర వసతులు ఉన్నట్లు ధృవీకరించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, భువనగిరి ఆర్డిఓ అమరేందర్, ట్రాఫిక్ ఎసిపి ఎం ప్రభాకరరెడ్డి, ప్రొఫెసర్ బాలాజీ, మున్సిపల్ కమీషనర్ రామాంజులు రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, జిల్లా రవాణ అధికారి బి సాయికృష్ణ, జిల్లా పౌర సంబంధాల అధికారి పి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్.వంశికృష్ణ, విద్యుత్ శాఖ డిఇ శ్రీనివాసచారి, ఆర్టిసి డివిజనల్ మేనేజరు శ్రీనివాసగౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్, పరీక్షల విభాగం సూపరింటెండెంట్ పార్ధసింహ్మారెడ్డిలు పాల్గొన్నారు.
Spread the love