ఎన్నికలకు నియమించిన కమిటీలు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

– 1201 పోలింగ్  కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
– అసెంబ్లీ సెగ్మెంట్లో సమావేశాలు  నిర్వహణ
– పోస్టల్ బ్యాలెట్  పకడ్బందీగా చేపట్టాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నియమించిన కమిటీలు తమ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా నియమించిన అధికారులు వారి బాధ్యతలు చేపట్టవలసిన అంశాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్.పి రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు  సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లత లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని  ఆదిశగా జిల్లాలో ఎం.సి.సి బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అన్ని చెక్ పోస్టుల్లో మరింత నిఘా ఉంచాలని జిల్లాలో అక్రమ మద్యం, నగదు, బంగారం ఇతర వస్తువులు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అన్నారు.  వచ్చే 18న  రెండో విడత ర్యాండమైజేషన్ చేపడుతామని అలాగే  సింబల్స్ ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  నాలుగు నియోజక వర్గాల్లో పోలీస్, సెక్టార్ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలో 1201  పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ తో పాటు సమస్యాత్మక కేంద్రాల్లో లోనా బయట కూడా వెబ్కాస్టింగ్ చేపట్టాలని సూచించారు. సీజర్ లో 181 కేసులకు గాను 162 కేసులు పరిశీలన తదుపరి విడుదల చేశామని అన్నారు.పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నియమించిన బృందాలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లాలో ఎన్నికల నిర్వహణ సిబ్బంది అలాగే ఇతర అధికారులు 7194 మంది ఉన్నారని అలాగే 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 6070, 40 శాతం  అంగవైకల్యం ఉన్న  16949 మందికి 12 డి అందించాని ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా నియోజక వర్గంలో  పేసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అలాగే ఇతర జిల్లాల కూడా ఫ్రీసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో రెండో  ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర రావు,ఆర్.డి.ఓ లు సూర్యనారాయణ, వేణు మాధవ్, శ్రీనివాస్, నోడల్ అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love