నిరుద్యోగులంతా కలిసి కెసిఆర్ ఓడించాలి

– ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కంభంపాటి సత్యనారాయణ
నవతెలంగాణ- కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నిరుద్యోగులు అందరు కలిసి కారు గుర్తుకు ఓటు వేయక కేసీఆర్ను ఓడించాలని ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కంభంపాటి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయనకు ఓటు వేయవద్దని ఓయూ విద్యార్థి సంఘటన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 92,000 ఉద్యోగాల భర్తీ చేస్తారని కేసీఆర్ ప్రకటించారని, ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగ మాటలు చెబుతూ అదిగో డిఎస్పి ఇదిగో డిఎస్పి అంటూ ఊరించాడన్నారు. 22 వేల  పోస్టులు ఖాళీ అని చెప్పి చివరికి 5000 భర్తీ చేశాడన్నారు. కేసీఆర్ ఓటమికై తిరుగుతామని గతంలోనే హెచ్చరించామని ఈ విషయాన్ని ప్రస్తుతం గుర్తు చేస్తున్నామన్నారు. గజ్వేల్  ప్రజలను పేరు చెప్పి చేశాడని, అక్కడ ఓడిపోతానని తెలిసి ప్రస్తుతం కామారెడ్డి కి వచ్చాడు అన్నారు. కామారెడ్డిలో గల భూములను అమ్ముకోవడానికి కేసీఆర్ వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచిస్తున్నామన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ను ఓడించి రాజకీయ నిరుద్యోగిని చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. లక్షల అప్పుచేసి ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ప్రశ్న పత్రాలు లీక్ చేశారని లీకేజీలపై సీటు వేసినా ఇప్పటికీ అతిగతి లేదని టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందన్నారు. దీంతోనైనా కామారెడ్డి నియోజకవర్గంలో చదువుకొని ఉద్యోగాల కోరారు. ఎదురుచూస్తున్న యువత గ్రహించాలన్నారు. కెసిఆర్ ఓటమిలో వారు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు.
Spread the love