నవతెలంగాణ-భిక్కనూర్: మండలంలోని 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలలో భాగంగా రెండు కార్లలో కలిపి ఎలాంటి పత్రాలు లేని 1,46 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ సమయంలో వాహనదారులు నగదును తీసుకెళ్తున్నప్పుడు నగదుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.