
పీహెచ్డీ పూర్తి చేసిన వాళ్లందరికీ మరోసారి వేదిక పైన గౌరవం కల్పించే విధంగా చూడాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు కు వినతి పత్రం అందజేత. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు ను మార్యదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ స్నాతకోత్సవం లో భాగంగా నోటిఫికేషన్ ను ఇప్పటికే విడుదల చేశారని, కానీ అందులో 2013 నుంచి 23 అకాడమీ ఇయర్ వాళ్లకు మాత్రమే ఉందన్నారు. ౠ వరైతే పీహెచ్డీ పూర్తి చేసి ఇంకా కాన్వకేషన్ తీసుకొని వాళ్లకు మాత్రమే కన్వకేషన్ అవకాశం ఇస్తామనడం పట్ల రెండు మూడు రోజుల నుంచి విన్నవిస్తున్నమని వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయి నుంచి మొదటి కాన్వకేషన్లు ఎవరు కూడా పీహెచ్డీ పూర్తి చేయలేదని, కాబట్టి ఎవరు కూడా కన్వకేషన్ ఇవ్వలేదన్నారు. ఈ రెండవ స్నాతకోత్సవంలో భాగంగా రెండో కాంబినేషన్లో భాగంగా దాదాపు 80 నుంచి 100 మంది పిహెచ్డి పూర్తి చేయడం ఒక మంచి శుభ పరిణామమని, యూనివర్సిటీకి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విషయం కాబట్టి దాదాపు పీహెచ్డీ పూర్తి చేసిన వాళ్లందరికీ మరోసారి వేదిక పైన గౌరవప్రదంగా ఇవ్వాలని విన్నవించారు.అనంతరం వైస్ ఛాన్సలర్ సానుకూలంగా స్పందించి అందరికీ గౌరవప్రదంగా ఇవ్వడానికి అన్ని అవకాశాలు చుస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. 2024 పిహెచ్ డి పూర్తి చేసిన వాళ్లకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని, ఒక మంచి పరిణామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణా ను కలిసి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ సరిత, డాక్టర్ పి బి సత్యం, డాక్టర్ జి రమేష్ ,డాక్టర్ జి సతీష్ తదితరులు పాల్గొ