కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15% హామీకి ఆమడదూరంలో కేటాయింపు

– టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్ 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
విద్యాశాఖకు గత ఏడాది కంటే 0.20%  కేటాయింపులు తగ్గాయని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్ అన్నారు.ఈ సంవత్సరం రూ 304,965 కోట్ల బడ్జెట్లో విద్యకు కేటాయించింది రూ 23108 కోట్లు (7.57%).గత సంవత్సరం రూ 274058 కోట్ల బడ్జెట్ లో విద్యకు కేటాయించింది రూ 21292 కోట్లు (7.77%)అంకెల్లో రూ 1816 కోట్లు పెరిగినట్లుగా ఉన్నప్పటికీ శాతాల్లో చూస్తే గత సంవత్సరం కంటే తగ్గింది.  విద్యాశాఖ పరిధిలో ఉన్న 26067 పాఠశాలలను గాలికొదిలేసి, రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతున్నది. గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమే. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 16 లక్షలు. వారిలో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారు మరియు బాలికలు. వీరికి నాణ్యమైన విద్య అందించడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు.విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, మెరుగైన మధ్యాహ్నభోజనం అందించేందుకు, నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా విద్యకు 15% నిధులు కేటాయించాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తోంది.
Spread the love