స్నేహానికి కేరాఫ్.. రాయపర్తి పాఠశాల పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి జెడ్పీఎస్ఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు స్నేహానికి కేరాఫ్ గా నిలుస్తున్నారు. పాఠశాలలో ఏ సంవత్సరంలో చదివిన విద్యార్థులైన వారు ఒక గ్రూపుగా ఏర్పడి వారి ఎస్ఎస్ సి బ్యాచ్ లో ఎవరికి ఎంతటి ఆపద వచ్చిన ఆదుకుంటూ ఆపద్బాంధవుల నిలుస్తున్నారు. 1997 – 1998 సంవత్సరంలో ఎస్ఎస్ సి బ్యాచ్ లోని ఒక మిత్రుడు మచ్చ అశోక్ అనారోగ్య సమస్యతో పక్షవాతానికి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కుటుంబం గడవడమే దినదిన గడ్డంగా ఉన్న పరిస్థితుల్లో వారి తండ్రి మద్ది రాములు అనారోగ్య సమస్యతో అకాల మరణం చెందాడు. దాంతో అశోక్ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతంగా తయారైంది. దాంతో పదవ తరగతి స్నేహితులు ఒక్కటై తలా కొంత డబ్బులు వేసుకొని మంగళవారం 24 వేల రూపాయలను అశోక్ కు అందించారు. స్నేహితులు చేసిన సహాయానికి అశోక్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తాము వెన్నంటే ఉంటామని స్నేహితులు భరోసా ఇచ్చారు. పదవ తరగతి బ్యాచ్ లో ఎవరికి ఆపద వచ్చిన అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగమళ్ళ స్వాతి, చిన్నబోయిన రవి, కర్ణాకర్ రెడ్డి, ఉపేందర్, రాజేష్, ప్రభాకర్, మోహన్, మహేందర్ రెడ్డి, స్వాతి, రాధిక, ఫెరోజ్ ఖాన్, విష్ణు, మాచర్ల ప్రభాకర్, అంకయ్య, శ్యామ్, జెరుపోతుల యాకయ్య, అంజద్ ఖాన్, యాకయ్య, రఫిక్, యాకుబ్,  శంకరాచారి, అఫ్రోజ్ ఖాన్, సునిల్, పిరని యాకయ్య, శ్రీను, కొండేటి రాజు, కోల రాజు, నాగుల రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.
Spread the love