నవతెలంగాణ-రామారెడ్డి
ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు కొనియాడారు. మండలంలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ, గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని ఆయా గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, రెడ్డి నాయక్, రగోతం రెడ్డి, దయానంద్, కొత్తోల యాదగిరి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.