అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్

నవతెలంగాణ- తంగళ్ళపల్లి
భారత రాజ్యాంగ నిర్మాత , ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడని పలువురు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు నాయకులు కార్మికులు అంబేద్కర్ సంఘాల నాయకులు అధికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కోడం రమణ, మండల కార్యదర్శి శ్రీరామ్ రమేష్ చంద్ర, బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, ఎంపీ ఓ మీర్జా, తంగళ్ళపల్లి తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జయంత్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ ఓ మీర్జా తోపాటు మండలంలోని పలు గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Spread the love