కొత్త రాయపర్తిలో ఘనంగా అంబెడ్కర్ జయంతి

నవతెలంగాణ – రాయపర్తి
భారత రాజ్యాంగ నిర్మాత.. బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కొత్త రాయపర్తి కాలనీలో మహనీయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన యువ శక్తి యువజన సంఘం నాయకులు, పెద్దలు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన అని కొనియాడారు. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు అని వ్యాఖ్యానించారు. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గారె నర్సయ్య, ఉపాధ్యాయులు కంజర్ల శ్రీను, సంఘం  అధ్యక్షుడు గారె బాబు, గౌరవ అధ్యక్షుడు మాచర్ల పరమేశ్వర్, కుమారస్వామి, వెంకన్న, ప్రధాన కార్యదర్శి సందీప్, సభ్యులు వెంకటస్వామి మహరాజ్, ప్రవీణ్, నరేష్, అనిల్, కృష్ణ, పెద్దలు భిక్షపతి, ఉప్పలస్వామి, సుధాకర్, సంపత్, అశోక్, జానీ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love