నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలం లోని పసర గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి నీ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెస్ పి పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు ఇరుగుపైడి పసర ఎస్ ఐ అచ్చు కమలాకర్ హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు 134వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి తధనంతరం మాట్లాడారు.న్యాయవాదిగా,,ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ దేశంలో అన్ని మతాలు తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని అని అన్నారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు బండి నాగేశ్వరావు ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు పంగ శ్రీను మాదిగ బిజెపి పార్టీ జిల్లా నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పురుగుజు వెంకన్న బిజెపి పార్టీ జిల్లా నాయకులు కర్ర సాంబశివారెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు చింత క్రాంతి మాల మహానాడు ఉద్యోగ సంఘాల నాయకుడు పత్తిరి కిరణ్ అంబేద్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు దీపాక కృష్ణ బిజెపి పార్టీ జిల్లా నాయకులు కొత్త సుధాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బొమ్మ గాని శ్రీనివాస్ గౌడ్ పత్రి పూర్ణ గంగెల్లి భరత్ గడ్డం ఎల్లయ్య కలమల్ల ఎంకన్న గాజుల కిరణ్ తిప్పనపల్లి సురేష్ మాదిగ వేమునూరు అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.