
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల లోని మచ్చాపూర్, బుస్సాపూర్ మరియు చల్వాయి గ్రామాల్లో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 134 వ జయంతి సందర్బంగా జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి మండల ఇంచార్జీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి విచ్చేసి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి మరియుకళ్యాణి గార్లు మాట్లాడుతూ ఈ దేశానికి చేసిన సేవ మహోన్నతమైంది. ఇవాళ ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాయి. భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించడంలో బాబా సాహెబ్ అంబేద్కర్ పాత్ర మరువలేనిది. అత్యంత మానవీయ విలువలకు దోసిలి పట్టే మహోన్నత భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛా, సౌభ్రాతృత్వం, సమానత్వం భావనల పునాదిగా తీర్చిదిద్దింది ఆయనే. ఈ రాజ్యాంగం ఎప్పుడు గొప్పది అవుతుందంటే, దీనిని సరిగా అమలు చేసినప్పుడని ఆనాడే అన్నారు అంబేద్కర్ , నేడు స్వయంగా రాసిన రచనల గురించి, ఆయన చేసిన ప్రసంగాల గురించి విద్యావంతులు, మేధావులు వెతుక్కొని మరి చదువుతున్నారు. అందుకు కారణం అంతటి మేధోశక్తి ఆయన సొంతం అని, కాకుంటే ఇంతకాలం ఆయనను కొన్ని వర్గాలకే పరిమితం చేసి కుదించి గౌరవించింది ఈ దేశం అని, ప్రస్తుతం మాత్రం అరుంధతీరాయ్ దగ్గరి నుండి అభ్యుదయ వాదుల దాకా ఎవ్వరైనా ఈ దేశానికి అంబేద్కరే గారే శరణ్యమంటున్నారు. ఏప్రిల్ 14 మహానుభావుని పుట్టిన రోజు సందర్భంగా ఆయన కృషిని అందరికీ తెలియజేయడమే నా లక్ష్యం అని అన్నారు.అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు నడపాలి. ఆ మహా త్యాగ శిఖరానికి జేజేలు అని, వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ బాపు గాంధీజీ, అంబేద్కర్ గారి ఆశయ సాధనలే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, పేద, ధనిక, కుల, మత, లింగ వివక్షలు లేని రాజ్యాంగాన్ని కాపాడటమే లక్ష్యంగా పోరాటం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు, మంత్రి సీతక్క మరియు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండల మచ్చాపూర్, బుస్సాపూర్ మరియు చల్వాయి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను, స్వాతంత్ర్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, గణతంత్ర్య రాజ్యం కోసం అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవులు, స్వేచ్ఛ, వారు చేసిన త్యాగాల గురించి మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ విధానాలతో ముందుకు సాగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కార్మిక శాఖా జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి వారితో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.