నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని కర్ణాటక సరిహద్దు గ్రామం మథురా తండా జిపిలో సర్పంచ్ చౌహన్ అనిత మోహన్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారని జిపి కార్యదర్శి స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని లింగ బేధాలు మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసిన వ్యక్తి అని గొప్ప మహానీయుడు విద్యావిత్తని కొని నడారు. బాల్యంలో అనేక సమస్యలు ఎదుర్కొన్న అంబేద్కర్ ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ దేశాలకు దిక్సూచి గా మారాలనారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, జిపి కార్యదర్శి శ్రావంతి, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మథురా తండాలో సర్పంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



