- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ రామ్ జి అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు జ్ఞానేశ్వర్, మల్లేష్ గొండ, గోవింద్, బాదు నాయక్, కట్ల శంకర్, కాశీరామ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



