నవతెలంగాణ-పెద్దవూర
అంబేద్కర్ ఆశయ సాధన లో భాగస్వామ్యం కావాలని ఎంఆర్పీ ఎస్, ఎంఎస్పీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ ఆడెపు నాగార్జున మాదిగ అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్134 వ జయంతి ఉత్సావాలు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, కెవిపిఎస్,బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా నాయకులు మాట్లాడు తూ విశ్వమంతటి ఖ్యాతిని గడించిన సామాజిక వైతాళికుడు చరిత్ర గతిని, గమనాన్ని మార్చిన తాత్వికుడు అంబేద్కర్ అని అన్నారు. సమసమాజపు స్వాప్నికుడు ఆకాశమంతటి ఆశయ శిఖరమైన ‘అంబేడ్కరు ఆశయాలు అని అన్నారు ప్రతి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వదిలిన ఆత్మగౌరవ హక్కుల రాజ్యాధికార రథాన్ని ముందుకు నడుపాలని కోరారు.అసమానతలు లేని నూతన సమ సమాజ నిర్మాణం దిశగా అణగారినవర్గాలు అందరూ ఏకమై పయనించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు దుబ్బ పరమేష్,దొంతాల నాగార్జున, మాల మహానాడు అధ్యక్షులు సీనియర్ నాయకులు మద్దూరి శ్రీనివాస్,సామాజిక కార్యకర్త తగరం శ్రీను, బూరుగు భీమయ్య, బీసీ నాయకులు మాజీ సర్పంచులు వీరబోయిన వెంకన్న యాదవ్, వెంకటేశ్వర్లు ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్లె పెళ్లి నరేందర్, తరి పెద్ద నాగయ్య, కళామండలి నియోజకవర్గ అధ్యక్షులు, కుక్కమూడి ముత్యాలు మాదిగ, మద్దూరి సతీష్ కుమార్, తుమ్మ శ్రీను సీనియర్ నాయకులు, మండాది సైదులు, తరి ఏడుకొండలు, దుబ్బ రమేష్, దొరే పల్లిమల్లయ్య, బుడిగపాక సత్యనారాయణ,ఎర్ర చంద్రయ్య, ఎలిమినేటి వెంకన్న, తుడుం రాకేష్,, తదితరులు పాల్గొన్నారు.