
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల,కొయ్యుర్, ఎడ్లపల్లి, రుద్రారం, వళ్లెంకుం టతోపాటు అన్ని గ్రామాల్లో అంబెడ్కర్ జయంతి వేడుకలు కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి రాజకీయ పార్టీలు,అంబెడ్కర్ యువజన సంఘాలు,దళిత సంఘాలు,నేషనల్ హ్యూమన్ రైట్స్,వివిధ కుల,ప్రజా సఘాలు,యునైటెడ్ ఫోరమ్ ఆర్టీఐ,అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ,ఆర్ఎంపీ,పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రుద్రారంలో ఉన్న అంబెడ్కర్ విగ్రహంతోపాటు అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,సంగ్గెం రమేష్,మండల రాహుల్,జంగిడి సమ్మయ్య,రాజు నాయక్,జంగిడి శ్రీనివాస్, కేశారపు చెంద్రయ్య, కిషన్ నాయక్,ఇందారపు చెంద్రయ్య,తాండ్ర మల్లేష్,చంద్రగిరి అశోక్,చిగురు సదానందం,అల్లాడి సురేష్,చెంద్రమొగిలి,ఇందారపు ప్రభాకర్,పులిగంటి నర్సయ్య,శ్రీనివాస్,యూత్ నాయకులు,వివిధ కుల సంఘాల,ఎన్ హెచ్ ఆర్సీ,ఆర్టీఐ,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.