నవతెలంగాణ – కుబీర్ : మండల కేంద్రమైన కుబీర్ తో పాటు ఫార్డి బి, పల్సి, సోనారి, హల్ద, సౌంలీ గ్రామాలతో పాటు అన్ని గ్రామంలో సోమవారం 134వ అంబెడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ఉన్న అంబెడ్కర్ విగ్రహలకు పూల మాల వేసి నివహాలు ఆర్పించారు, దింతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రాసిన వ్యక్తి అయన ఆశయాలను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని అయన అడుగుజాడల్లో నాడచేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఏశాల దత్తాత్రి బోయిడి విఠల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ప్రకాష్ రాథోడ్, విజయ్ కుమార్ బషీర్, మోహియొద్దీన్, వివేకానంద బంక బాబు సూది రాజన్న కళ్యాణ్, చంద్రశేఖర్, గాయక్ వాడ్ తుకరం కాశినాథ్ మండల నాయకులు, అంబెడ్కర్ వదులు, తదితరులు ఉన్నారు