
– వినతి పత్రాన్ని ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేడ్కర్ భవన్ నిర్మాణము కోసం మూడెకరాల భూమిని కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్ర నాయక్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు చిట్యాల సాయన్న, బాబాయిలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేడ్కర్ భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వభమిని కేటాయించాలని కోరుచున్నాము అన్నారు. కామారెడ్డి మండలంలోని చిలిచిపోరు గ్రామ శివారులో సర్వేనెం : 116 గతంలో అంబేడ్కర్ భవనం కోసం కేటాయించిన భూమిలో కోంతమందికి ఇండ్ల కోసం పట్టా సర్టిపికెట్లు ఇవ్వడం జరిగిందనీ, ఆ యొక్క లబ్దిదారు ప్లాట్లను రియల్పస్పేట్ వారికి అమ్మడం, అట్టి స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకోవడం జరిగిందన్నారు. ఈ భూమి గొడము ఉన్నందున జిల్లా కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ చేసి అంబేడ్కర భవనం నిర్మాణం కోసం ప్రభత్వ ఆద్వర్యంలో ఉన్న మూడు ఎకరల స్థలంను కేటాయించలని మా ఎమ్మార్పీఎస్ సంఘం ఆద్వర్యంలో కోరుచున్నాము అన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఆదేశాల అముు చేయలీ….
కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆయా గాలమాల ఎస్సీ, ఎస్టీ లీపై దాడులుగాని, సాంఘిక బహిష్కరణ గాని, దేవాలయంలో పూజలు చేస్తే అగ్రకులాల వాళ్ళు అడ్డుకోవడంగాని ఇంకా ఇతర రకాల సమస్యలపై మండల తహసిల్దార్, పోలీస్ శాఖ ఎస్సై లు మండలంలో ఉన్న గ్రామాలలో పర్యటించి ప్రతీనెల చివరిరోజున నివేదిక (రిపోర్టు) ను తయారుచేసి ఆర్డీవో, ఎస్పీలకు పంపాలని ఉన్న వారు మాత్రం అలా పంపడం లేదన్నారు. డివిజన్ అధికారులు జిల్లా అధికారులకు ఈ విషయంపై నివేదిక పంపాలి, జిల్లా కలెక్టర్ వీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్టు తయారుచేసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు పంపాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఆదేశాలను అమలు చేయాలని మా ఎమ్మార్పీఎస్ సంఘం ఆద్వర్యంలో కోరుచున్నాము అన్నారు.