తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జెస్సు అనిల్ కుమార్ కు సన్మానం..

నవతెలంగాణ – ఆర్మూర్  

2009వ సంవత్సరంలో  ఉధృతంగా సాగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి ఎందరో ఉద్యమ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి బి జె పి నాయకులు జెస్సు అనిల్ కుమార్ ను అప్పటి పోలీసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క ఒత్తిళ్లకు లొంగి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. ఆ జైల్లో సైతం జెస్సు అనిల్ కుమార్ అప్పుడు ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఒక వైపు నిరాహార దీక్ష చేస్తా ఉంటే మరోవైపు జైల్లోనే జెస్సు అనిల్ కుమార్ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాదాపు మూడున్నర రోజులపాటు ఆహారం లేకుండా  నిరాహారదీక్ష చేయడం  బెయిల్ రావడంతొ జైలు నుండి బయటికి రావడం జరిగింది. పది సంవత్సరాల తెలంగాణ ఉత్సవాల భాగంగా  బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా  శాలువాతో,పూలమాలతో సన్మానించడం జరిగింది. తనను సన్మానించినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో  పట్టణ ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులి యుగంధర్,  పట్టణ ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, ఓబీసీ మోర్చా , పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, బీజేవైఎం  పట్టణ కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.
Spread the love