సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య: ఛైర్ పర్సన్ అన్నపూర్ణ

నవతెలంగాణ – నాగార్జునసాగర్
సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని  ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని నందికొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నపూర్ణ అన్నారు. బుధవారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని శ్రీ వేమూరు అభిరామేశ్వర రావు ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హజరై బోధన సిబ్బందితో కలిసి ఉచిత పాఠ్య పుస్తకాలు,నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ మాట్లాడుతూ.. ప్రతి పాఠానికి రెండు భాషల్లో ముద్రించడంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు పుస్తకాల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు,యూనిఫాం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని  ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలన్నారు. మంచి అర్హత గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని,వీరు అంకిత భావంతో పని చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి,ఐదవ వార్డ్ కౌన్సిలర్ రమేష్ జి,ప్రధానోపాధ్యాయులు శేషు,ఉపాధ్యాయులు రాజాబాబు, ధనమ్మ,పిఈటి లక్ష్మి,పిడి విమల,రమ్య,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love