బహిరంగ వేలం ప్రకటన..

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలంలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను స్వాధీన పరుచుకొని ముత్తారం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 133 (కెజిబివి స్కూల్ దగ్గ ర) నిల్వ ఉంచడం జరిగిందని, స్వాధీన పరుచుకున్న ఈ ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వేలం అధికారి, ముత్తారం మండల గిర్దవార్ 1 ఒక ప్రకటన తెలిపారు. 53 ట్రాక్టర్ ట్రిప్పుల ఇ సుక ఉందని, దీని విలువ రూ.1,00,170 రూపాయలుంటుందని తెలిపారు. నిర్ణయించిన ప్రకారం 5వే ల దరావత్ కట్టి వేలంలో పాల్గొనాలని, వేలంలో పాల్గొనే వారు ఆదాయ పన్ను రిటర్స్ కాపీ సమర్పించాలని, వేలం దక్కని వారికి వేలం ముగిసిన అనంతరం చెల్లించిన పైకంకు సంబంధించిన రశీదు తీసుకొని సొమ్ము ఇవ్వబడునని, బహిరంగ వేలంలో ఎక్కువ పాట పాడి అర్హత పొందిన వారికి సరు కు స్వాధీనం చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు లోబడి ఉండునని, ఎక్కువ పాట పాడిన వా రికి వేలం జరిపించు అధికారి అనుమతి ఇచ్చిన 24గంటల లోపు పాటకు సంబంధించి మొత్తం పైకం చెల్లించి సరుకును స్వాధీన పరుచుకోవాలని తెలిపారు. వేలం జరుపుటకు ముందు రోజులలో సరుకును పరిశీలించుకోవడానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జులై 2న ఉదయం 11. 30గంలకు ముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో ఈ బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుం దని, ఆసక్తి, అర్హత గలిగిన వారు పాల్గొనాలని ఆయన సూచించారు.
Spread the love