– లేకపోతే అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వం : మెట్టు సాయికుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డిని అవమానించిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడారు. లేకపోతే అసెంబ్లీ అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ప్రజల కోసం బయటికి రాని కేసీఆర్ కుటుంబ పరువు పోతుందని డీజీపీ కాల్ చేశారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి అంటే విశ్వసనీయతకు మారుపేరని కొనియాడారు. పోలీసులు వెంటనే హరీశ్ రావును అరెస్టు చేయాలని కోరారు.