Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు దరఖాస్తుల గడువు పెంపు

కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు దరఖాస్తుల గడువు పెంపు

- Advertisement -

ఈ నెల 16 వరకు అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

కానిస్టేబుల్ ఎస్‌ఐ పోస్టులకు ప్రకటించిన దరఖాస్తు గడువును ఈనెల 16వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పోలీస్‌ ‌రిక్రూట్‌‌మెంట్‌ ‌బోర్డు మంగళవారం ప్రకటించింది. పోలీస్ శాఖ తో పాటు ఎస్పీఎఫ్ ఫైర్ సర్వీసులు జైళ్ల శాఖల్లో కలిపి 7,443 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు ఈ నెల తొమ్మిదో తేదీగా నిర్ణయించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరో వారం పాటు అనగా ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -