కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆమె కానిస్టేబుల్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేండ్లు సమయం వృధా చేయడంతో చాలా మంది అభ్యర్థుల వయో పరిమితి మించిపోయిందని తెలిపారు. ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలు, కానిస్టేబుల్ జాబులకు 36 ఏండ్ల వరకు పెంచాలని కోరారు. 20 వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని ఆమె విమర్శించారు. వయోపరిమితి, పోస్టుల సంఖ్య కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు.
ప్రజా సమస్యలు చర్చించండి
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సమస్యలు పట్టించుకోకుండా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాజకీయాలకు వేదికగా మార్చుకున్నాయని ఆమె విమర్శించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే దూషణలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తుందని ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడుతున్నా కాంగ్రెస్ ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం గుండాగిరీని ప్రోత్సహిస్తే శాంతి భద్రతలను కాపాడేది ఎవరని ఆమె ప్రశ్నించారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



